- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ విజయం వెనుక ఎంతో శ్రమ ఉంది.. షాకింగ్ ఫొటోలు షేర్ చేసిన రిషబ్ శెట్టి..
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి(Rishabh Shetty) ఇటీవల ‘కాంతార: చాప్టర్1’ (Kantara: Chapter 1)సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు.

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి(Rishabh Shetty) ఇటీవల ‘కాంతార: చాప్టర్1’ (Kantara: Chapter 1)సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. ఆయన స్వయం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రికార్డులు సాధిస్తూ థియేటర్స్‌లో దూసుకుపోతుంది. విడుదలైన 9 రోజులకే ఏకంగా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనంగా మారింది. దీంతో సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న రిషభ్ శెట్టి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లను గుర్తు చేసుకుంటూ పలు విషయాలను వెల్లడిస్తున్నారు. ఇక చాలామంది క్లైమాక్స్ సీన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈక్రమంలో.. తాజాగా, రిషబ్ శెట్టి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షాకింగ్ ఫొటోలు షేర్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఇక ఇందులో కాళ్లు మొత్తం దుమ్ముతో, నల్లగా మారిపోయాయి. ‘‘ఇవి క్లైమాక్స్ సమయంలో తీసుకున్న ఫొటోలు. సినిమా విడుదలయ్యాక అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఈ మూవీ విజయం వెనుక ఎంతో శ్రమ ఉంది.
వాచిపోయిన కాళ్లు.. అలసిపోయిన శరీరంతో షూట్ చేశాం. మీరు ఆరాధించే స్థాయిలో చిత్రీకరించగలిగాం. ఇది మేము నమ్మిన దైవిక శక్తి ఆశీర్వాదం వల్లే సాధ్యమైంది. మాపై ఆదరణ చూపిస్తూ మద్దతు ఇస్తున్న వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా’’ అని రాసుకొచ్చారు. ఇక రిషబ్ కాళ్లు చూసిన వారు కొందరు షాక్ అవుతుండగా.. మరికొందరు మీ డెడికేషన్‌కు హ్యాట్స్‌ఆఫ్ సార్ అని అంటున్నారు.






