‘భద్రకాళి’ లాంటి మూవీ ఇప్పటివరకు రాలేదు.. ఇందులో ఆలోచింపచేసే అంశాలున్నాయి: రామాంజనేయులు

by Mallepaka Hamsa |

విజయ్ ఆంటోనీ(Vijay Antony) ‘భద్రకాళి’(Bhadrakali)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

‘భద్రకాళి’ లాంటి మూవీ ఇప్పటివరకు రాలేదు.. ఇందులో ఆలోచింపచేసే అంశాలున్నాయి: రామాంజనేయులు
X

దిశ, సినిమా: విజయ్ ఆంటోనీ(Vijay Antony) ‘భద్రకాళి’(Bhadrakali)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కనెక్ట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 'భద్రకాళి' సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రామాంజనేయులు జవ్వాజీ (Ramanjaneyalu Javaji)విలేకరుల సమవేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘‘విజయ్ ఆంటోనీ గారు నేను ఎప్పటినుంచో మంచి మిత్రులం. కొన్ని మూవీస్ చేయాలని ప్రయాణం మొదలుపెట్టాం.

ఇటీవలే బూకి అనే సినిమాని మొదలుపెట్టాం. మలయాళం లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. అది చివరి దశకు వచ్చింది. మా రెండు బ్యానర్స్ లో ఇంకొన్ని సినిమాలు కూడా చర్చల్లో ఉన్నాయి. మా నుంచి వరుసగా సినిమాలు రాబోతున్నాయి. డైరెక్టర్ అరుణ్ ప్రభు గారు కథ చెప్పారు. చాలా బాగుంది. డైరెక్టర్ గారు అంతకుముందు తీసిన రెండు సినిమాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. భద్రకాళి సినిమాకి అరుణ్ బాబు గారు ఒక బ్యాక్ బోన్. ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్‌తో పాటు ప్రేక్షకులను ఆలోచింపచేసే అంశాలు కూడా ఉన్నాయి. సినిమా అంత అద్భుతానికి రావడానికి కారణం డైరెక్టర్ గారి విజన్. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.

ఇది విజయ్ ఆంటోనీ గారికి 25వ సినిమా అవ్వడం కూడా కలిసి వచ్చింది. మంచి బడ్జెట్ అద్భుతమైన కంటెంట్ తోవస్తున్న సినిమా ఇది. తమిళ్ తెలుగు కన్నడ హిందీలో ఒకేసారి రిలీజ్ చేస్తున్నాం. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి కానీ ఈ మూవీలో హీరో గారు చేసిన క్యారెక్టర్‌తో ఇప్పటివరకు ఎలాంటి సినిమా రాలేదు. చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఇలాంటి హీరో క్యారెక్టర్‌తో ఇప్పటివరకు చిత్రం రాలేదు. ఇందులో చాలా మంచి స్ట్రాంగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆడియన్స్ కి కచ్చితంగా కనెక్ట్ అవుతాయి. సమాజంలో జరుగుతున్న విషయాల్ని బేస్ చేసుకుని తీసిన సినిమా. అందరూ పర్సనల్‌గా కనెక్ట్ అవుతారు’’ అని చెప్పుకొచ్చారు.

Next Story