ఇండస్ట్రీలో తిమింగలాలు ఉన్నాయి.. మంచు మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్.. ఎవరిని ఉద్దేశించంటే?(వీడియో)

by Mallepaka Hamsa |

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ ‘భైరవం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు.

ఇండస్ట్రీలో తిమింగలాలు ఉన్నాయి.. మంచు మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్.. ఎవరిని ఉద్దేశించంటే?(వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ ‘భైరవం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ‘మిరాయ్’ మూవీలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మంచు మనోజ్(manchu manoj), శ్రియ శరణ్, జగపతి బాబు, జయరామ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న.. ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ట్రైలర్ లాంచ్ చేయగా.. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న మంచు మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ‘‘టీజీ విశ్వ ప్రసాద్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న నిర్మాత.

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని విజయం అందుకోవడం మామూలు విషయం కాదు. అలాంటిది విశ్వ ప్రసాద్ గారు మాత్రం సినిమాలతో సాటు టీవీ సీరియల్స్ కూడా చేసుకుంటూ దూసుకుపోతున్నారు. మీలాంటి గుండె వంద సంవత్సరాలు బ్రతకాలి సార్. సినిమా ఇండస్ట్రీలో తిమంగలాలు ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. విశ్వప్రసాద్ గారు మాత్రం తిమింగలాలకు దొరకకుండా రివర్స్ అటాక్ చేస్తూ తన చిత్రం కోసం నిలబడ్డారు. హనుమాన్ సినిమా తర్వాత ‘మిరాయ్’ కోపం తేజ సజ్జాను నన్ను డైరెక్టర్ కార్తిక్‌పై ఉన్న నమ్మకంతో ఈ మూవీని ముందు ఉండి ఎన్ని అడ్డంకులు వచ్చినా సినిమాను ముందుకు నడిపిస్తున్నారు’’అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మంచు మనోజ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. నెటిజన్లలో పలు అనుమాలను రేకెత్తిస్తున్నాయి. తిమింగలాలు ఎవరు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

link

Next Story