- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలో ఇంకా చాలా సర్‌ప్రైజులు ఉన్నాయి : జీవీ ప్రకాష్
ఇప్పటివరకు విడుదలైన టీజర్ కేవలం శాంపిల్ మాత్రమేనని, ఇందులో అసలైన సర్‌ప్రైజ్‌లు చాలా ఉన్నాయి.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ప్రేమలు’ బ్యూటీ మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈక్రమంలో.. తాజాగా ఈ సినిమా సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఆయన బయటపెట్టారు. ‘లక్కీ భాస్కర్’ సినిమా తర్వాత, సూర్య గారికి ఫోన్ చేసి మరీ వెంకీ అట్లూరితో ఓ ప్రాజెక్ట్ చేయమని తానే కోరానని, అందుకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని జీవీ తెలిపారు.
అంతేకాకుండా, ఇప్పటివరకు విడుదలైన టీజర్ కేవలం శాంపిల్ మాత్రమేనని, ఇందులో అసలైన సర్‌ప్రైజ్‌లు చాలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సూర్య లుక్స్ గురించి జీవీ ప్రకాష్ మాట్లాడుతూ.. "నేను స్కూల్లో ఉన్నప్పుడు సూర్య గారి ‘గజిని’ సినిమా చూసి ఎంతగా ఎంజాయ్ చేశానో, ఇప్పటికీ ఆయనలో అదే ఆకర్షణ ఉంది. సూర్య ఏమాత్రం మారలేదు" అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో సూర్యను ఒక ప్రత్యేకమైన జానర్‌లో చూపించబోతున్నామని, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే అవుట్‌పుట్ చాలా క్వాలిటీగా వచ్చిందని, సంగీతానికి ఈ చిత్రంలో చాలా ప్రాధాన్యత ఉందని జీవీ ప్రకాష్ చెప్పడంతో సూర్య అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.






