- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'ఈషా'లో చాలా షాకింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి.. అలాంటి వారు మూవీ చూడొద్దు: శ్రీనివాస్ మన్నె
దర్శకుడు శ్రీనివాస్ మన్నె(Srinivas Manne) తెరకెక్కించిన చిత్రం 'ఈషా'(Isha).

దిశ, సినిమా: దర్శకుడు శ్రీనివాస్ మన్నె(Srinivas Manne) తెరకెక్కించిన చిత్రం 'ఈషా'(Isha). బన్నీవాస్(bunny vasu), వంశీ నందిపాటి ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు శ్రీనివాస్ మన్నె శుక్రవారం పాత్రికేయులతో ముచ్చటించారు. హారర్‌తో పాటు మన జీవితాల్లో ఉన్న చావులు పుట్టుకలు, అండర్ కరెంట్‌లో దైవత్వం, సృష్టి చేసే పనులు ఇలా అన్ని అంశాలు ‘ఈషా’లో ఉంటాయి. సృష్టి అన్నింటిని బ్యాలెన్స్ చేస్తుంది. ఈ చిత్రంలో స్ట్రాంగ్‌గా కంటెంట్‌గా ఉంటుంది. ఈ సినిమాలో అన్ని అంశాలను టచ్ చేశాం. టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉండే సినిమా ఇది. ఇందులో చాలా షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. వాంటెడ్‌గా ఉండదు సినిమా చూసి భయపడతారు అంతే.
హార్ట్ వీక్‌గా ఉన్నవాళ్లు కూడా ఈ చిత్రం చూడకూడదు. సెన్సార్ వాళ్ళు చూసి సినిమా చాలా భయంకరంగా ఉంది గుడ్ కంటెంట్ అన్నారు. మూడ నమ్మకాలు,ఆత్మలు అన్నింటిని చర్చిస్తున్నాం. మనకు జరగనంత వరకు ఏదైనా మూడ నమ్మకమే. మనకు జరిగితే అది నమ్మకంగా మారుతుంది. అనే విషయం కూడా ఈ సినిమాలో చూపిస్తున్నాం. రియల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్లకు నమ్మకం. మనకు జరగలేదు కాబట్టి మూడ నమ్మకం. సృష్టిలో అన్ని ఉంటాయి. ఆత్మ అనేది లేకపోతే ఆ పదమే పుట్టదు కదా,మంచి చెడు ఉన్నట్లే అది కూడా ఉంటుంది. అందరూ ఉలిక్కిపడి లేచే విధంగా ఉంటుంది’’ అన్నారు.






