- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్టీఆర్- త్రివిక్రమ్ మూవీలో లక్కీ చాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ.. పోస్ట్‌తో హింట్ ఇచ్చేసిందిగా!
కేరళ కుట్టి మంజిమా మోహన్ (Manjima Mohan)చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి వచ్చి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

దిశ, సినిమా: కేరళ కుట్టి మంజిమా మోహన్ (Manjima Mohan)చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి వచ్చి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. దీంతో ఈ అమ్మడు ‘ఓరు వడక్కన్ సెల్‌ఫీ’ మూవీతో హీరోయిన్‌గా మారింది. తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి అనతికాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఇక తెలుగులో ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో నటించి మెప్పించింది. ప్రస్తుతం మంజిమా భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ భామ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆనంద్ బాలసుబ్రమణ్యం(Anand Balasubramaniam) రాసిన ది లార్డ్ ఆఫ్ వార్.. ది గాడ్ ఆఫ్ విస్డమ్ బుక్‌ను షేర్ చేసింది.
ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్టీఆర్-త్రివిక్రమ్(Trivikram) కాంబోలో రాబోతున్న ‘మురుగన్’(Murugan) మూవీలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నట్లు చర్చలు మొదలయ్యాయి. ఇటీవల అలాంటి బుక్‌ను ఎన్టీఆర్ పట్టుకుని కనిపించిన విషయం తెలిసిందే. ఈ బుక్ ఆధారంగా రాబోతున్న సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొన్నాయి. ఇక మంజిమా, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న మొదటి ప్రాజెక్ట్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించిస్తున్నారు. కాగా, ఈ చిత్రం హారికా హాసిని నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించనున్నట్లు టాక్.
linksy






