'Pathan' Trailer డేట్ వచ్చేసింది.. ఎప్పుడో తెలుసా?

by Disha Web Desk 17 |
Pathan Trailer డేట్ వచ్చేసింది.. ఎప్పుడో తెలుసా?
X

దిశ, సినిమా: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ దాదాపు నాలుగేళ్ల తర్వాత 'పఠాన్' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శక‌త్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంలో 'బేషరం రంగ్' సాంగ్ వివాదం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఒకానొక దశలో సినిమాలో ఈ పాటను మాత్రమే కాదు.. మొత్తం సినిమానే బ్యాన్ చేయాలని డిమాండ్స్ వినిపించాయి.

ఇదిలావుంటే ఎప్పుడెప్పుడా అని షారుఖ్‌ అభిమానులు ఎదురుచూస్తున్న 'పఠాన్‌' ట్రైలర్‌ డేట్‌ను చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ట్రైలర్‌ను జనవరి 10న రిలీజ్‌ చేయబోతున్నట్లు ట్వీటర్ వేదికగా వెల్లడించింది. రిలీజ్‌కు ముందే వివాదాల్లో కూరుకుపోయిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

ఇవి కూడా చదవండి : UA సర్టిఫికెట్ పొందిన 'Waltheru Veeraiah'!

Next Story

Most Viewed