మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది.. గుడ్ న్యూస్ చెప్పిన కీర్తి సురేష్ (పోస్ట్)

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుంది.

మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది.. గుడ్ న్యూస్ చెప్పిన కీర్తి సురేష్ (పోస్ట్)
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుంది. అయినప్పటికీ ఇండస్ట్రీకి దూరం అవకుండా.. వరుస చిత్రాల్లో నటిస్తోంది. కానీ గత కొద్ది కాలంగా విజయాన్ని అందుకోలేకపోతుంది. ఇక ఇటీవల కీర్తి ఉప్పుకప్పురంబు, రివాల్వర్ రీటా చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఈ రెండు బాక్సాఫీసు వద్ద హిట్ సాధించలేకపోయాయి. ఇక 2023 నుంచి హిట్ కోసం తాపత్రయపడుతున్న కీర్తి సురేష్‌కు నిరాశనే మిగులుతోంది. పెళ్లైనప్పటి నుంచి అమ్మడుకి లక్ పెద్దగా కలిసిరావడం లేదు. అయినా హిట్, ఫ్లాప్ అని ఆలోచించకుండా వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తోంది. తాజాగా, కీర్తి సురేష్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ గుడ్ న్యూస్ ప్రకటించింది. తాను చేస్తున్న సినిమాకు సంబంధించిన విషయాలను వెల్లడించింది.

ఇందులో కోలీవుడ్ కీర్తి సురేష్, సంచలన దర్శకుడు మిస్కిన్(Mysskin) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్రవీణ్ విజయ్(Praveen Vijay) దర్శకత్వం వహిస్తున్నారు. ‘ప్రొడక్షన్-9’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డ్రమ్‌స్టిక్ ప్రొడక్షన్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అలాగే త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ.. ‘‘మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రొడక్షన్-9 ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది’’ అనే క్యాప్షన్ జత చేసింది. అలాగే మూవీ టీమ్‌తో తీసుకున్న ఫొటోలను షేర్ చేసింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు సూపర్ ఎగ్జైటెడ్.. అంటూ కంగ్రాట్స్ చెబుతున్నారు.

Next Story