రాజ్ తరుణ్- విజయ్ మిల్టన్ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌కు మహూర్తం ఫిక్స్..

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun)గత ఏడాది ‘పురుషోత్తమ’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు.

రాజ్ తరుణ్- విజయ్ మిల్టన్ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌కు మహూర్తం ఫిక్స్..
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun)గత ఏడాది ‘పురుషోత్తమ’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ఓ భారీ ప్రాజెక్ట్‌తో రాబోతున్నాడు. తమిళ డైరెక్టర్ విజయ్ మిల్టన్ (Vijay Milton)దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే. ‘ప్రొడక్షన్-5’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో భరత్, ఆరి అర్జునన్, సునీల్, పాల్ డబ్బా, వేదన్, కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో రాజ్ తరుణ్ సరసన అమ్ము అభిరామి(Ammu Abirami) హీరోయిన్‌గా కనిపించనుంది.

ఈ మూవీని గోలి సోడా బ్యానర్‌పై విజేత, ప్రసన్న బాలచంద్రన్, ఇమ్మన్ అనాచి నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాబోతున్నట్లు విజయ్ మిల్టన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను శ్రీరామ్, ప్రభు ఆగస్టు 27న ఉదయం 11: 11 గంటలకు లాంచ్ చేయబోతున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా ఈ మూవీకి సంబంధించిన ప్రధాన పాత్రల పోస్టర్లు కూడా రాబోతున్నట్లు వెల్లడించాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న రాజ్ తరుణ్ అభిమానులు సూపర్ ఎగ్జైటెడ్ అని కామెంట్లు పెడుతున్నారు.

Next Story