గూస్‌బంప్స్ తెప్పిస్తోన్న ‘చాంపియన్’ టీజర్.. బ్రిటిష్ వాళ్లని ఓ ఆట ఆడుకుంటున్న రోషన్

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-23 15:56:25  IST  )

హీరో శ్రీకాంత్ తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చి ‘పెళ్లి సందడి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు రోషన్(Roshan).

గూస్‌బంప్స్ తెప్పిస్తోన్న ‘చాంపియన్’ టీజర్.. బ్రిటిష్ వాళ్లని ఓ ఆట ఆడుకుంటున్న రోషన్
X

దిశ, సినిమా: హీరో శ్రీకాంత్ తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చి ‘పెళ్లి సందడి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు రోషన్(Roshan). హిట్ ఖాతాలో వేసుకున్నప్పటికీ అవకాశాలు రాకపోవడంతో కొద్దికాలం పాటు సినిమాలకు దూరం అయ్యారు. మళ్లీ నాలుగెళ్ల తర్వాత తన మూడవ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘చాంపియన్’ (Champion)అనే టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతుంది. ప్రకటన విడుదలైన మూడేళ్ల తర్వాత ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

అంతేకాకుండా మూవీ టీమ్ ప్రమోషనల్ కంటెంట్‌ను కూడా పెంచుతోంది. అప్డేట్స్ రిలీజ్ చేస్తూ హైప్ పెంచుతున్నారు. తాజాగా, ‘చాంపియన్’ టీజర్ విడుదల చేయగా.. ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఒక్కన్నే సెంటర్‌కి వెళ్లి బాల్ తీసుకొని వెళ్తా గోల్ కొడతా అనే డైలాగ్‌తో టీజర్ మొదలు కాగా.. గుర్రాల మీద బ్రిటిష్ వాళ్ళు రాగా.. రోషన్ వారితో మాటలతోనే యుద్ధం చేశాడు.

నా పేరు మైఖెల్ అంటూ పరిచయం చేసుకుని ఫుట్‌బాల్ ఆడుతూ కనిపించగా.. కొంతమంది గుర్రాలపై వచ్చి షూట్ చేస్తూ కనిపించారు. చుట్టూరా మొత్తం ఏదో యుద్ధం లాగా కనిపిస్తోంది. ఫుట్‌బాల్ ఆటలో గెలవడంతో పాటు.. బ్రిటీష్‌ వారిని చితక్కొట్టి ఓ ఆట ఆడేసుకుంటాడు. ఒక నిమిషం నిడివి కలిగిన ఈ టీజర్ యూట్యూబ్‌లో వైరల్ అవుతూ గూస్ బంప్స్‌ను తెప్తిస్తోంది. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహిత ప్రదీప్ అద్వైతం (Pradeep Advaitam)తెరకెక్కిస్తున్నారు. జీ స్టూడియోస్, స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. డిసెంబర్ 25న థియేటర్స్‌లో విడుదల కానుంది.

Next Story