- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ ‘3BHK’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
కోలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్(Siddharth), శ్రీగణేష్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘3BHK’.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్(Siddharth), శ్రీగణేష్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘3BHK’. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వచ్చిన ఈ చిత్రంలో శరత్ కుమార్(Sharath Kumar), దేవయాని, మీతా రంగనాథ్, యోగిబాబు(Yogi Babu), చైత్ర కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా జులై 4న థియేటర్స్‌లో విడుదలై మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీసు వద్ద ఊహించని విధంగా మంచి కలెక్షన్లు రాబట్టింది.
దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి పెరిగింది. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైనట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ సింప్లీ సౌత్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ బాషల్లో ఆగస్టు 1 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. భారత్‌లో ఉన్న ప్రేక్షకులకు ఈ సినిమా చూసే అవకాశం లేదు. కేవలం ఇతర దేశాల్లో ఉన్నవారికే మాత్రమే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.






