‘వెంకీ పింకీ జంప్’ టైటిల్‌తోనే స్టోరీ అర్థమవుతుంది..

by Mallepaka Hamsa |

విక్రమ్(Vikram), రమ్య (Ramya)హీరో హీరోయిన్లు గా నటిస్తున్న సినిమా ‘వెంకీ పింకీ జంప్’(Venky Pinky Jump).

‘వెంకీ పింకీ జంప్’ టైటిల్‌తోనే స్టోరీ అర్థమవుతుంది..
X

దిశ, సినిమా: విక్రమ్(Vikram), రమ్య (Ramya)హీరో హీరోయిన్లు గా నటిస్తున్న సినిమా ‘వెంకీ పింకీ జంప్’(Venky Pinky Jump). ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై వెంకట్, బాబా నిర్మిస్తున్నారు. దర్శకుడు అజయ్ రూపొందిస్తున్నారు. తాజాగా, ఆడియో రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా.. అజయ్ యన్ మాట్లాడుతూ.. యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఇది. ‘వెంకీ పింకీ జంప్’ టైటిల్ లోనే మీకు స్టోరీ ఎలా ఉండబోతుంది అర్థమై ఉంటుంది. వెంకీ పింకీ లవ్ చేసుకుంటారు. వాళ్లు తమ ప్రేమను గెలిపించుకునేందుకు ఊరి నుంచి పారిపోతారు. ఆ తర్వాత వాళ్ల ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఆసక్తికరమైన కథా కథనాలతో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సాగుతుంది. ఈ చిత్రంలో ఆనంద్ రాజా గారి మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది’’ అని అన్నారు.

Next Story