పెళ్లికి ముందే ప్రియుడితో హనీమూన్‌కు చెక్కేసిన స్టార్ హీరోయిన్

by Disha Web Desk 9 |
పెళ్లికి ముందే ప్రియుడితో హనీమూన్‌కు చెక్కేసిన స్టార్ హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ లవ్‌లో పడటం, డేటింగ్‌లకు వెళ్లడం, కొంతమంది మధ్యలోనే విడిపోవడం, మరికొంతమంది పెళ్లిపీటలెక్కడం.. అనంతరం మనస్పర్థాల వల్ల డివోర్స్ తీసుకోవడం లాంటి వార్తలు తరచూ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటాయి. కాగా స్టార్ కిడ్ అనన్య పాండే ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఈ భామ ‘లైగర్’ చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా ప్లాప్ కావడంతో మళ్లీ బాలీవుడ్‌కే చెక్కేసింది. అయితే గత కొన్ని రోజులుగా అనన్య, ఆదిత్య రాయ్‌ Aditya Roy Kapurతో సీక్రెట్ డేటింగ్ చేస్తున్నట్లు, పార్టీలు, పబ్బుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. తాజాగా.. దుబాయ్ వెకేషన్‌కు వెళ్లారు. అక్కడ బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేస్తున్న పిక్స్‌ను నెట్టింట వేర్వేరుగా షేర్ చేశారు. దీంతో వీరిద్దరూ కలిసే అక్కడికి వెళ్లారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అలాగే సీక్రెట్‌గా ముంబై ఎయిర్ పోర్టులో కలిసి వెళ్లినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీంతో పెళ్లికి ముందే హానీమూన్‌కు వెళ్తున్నారా ఏంటి? అంటూ జనాలు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed