- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Indraja Shankar: పెళ్లైన 6 నెలలకే తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన స్టార్ కమెడియన్ కూతురు.. పోస్ట్ వైరల్
కోలీవుడ్ స్టార్ కమెడియన్ రోబో శంకర్ కూతురు ఇంద్రజ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ కమెడియన్ రోబో శంకర్ కూతురు ఇంద్రజ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. శంకర్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా దళపతి విజయ్ విజిల్ మూవీలో కీలక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల్లోనూ పాపులారిటీ తెచ్చుకుంది. అయితే ఇంద్రజ తన స్నేహితుడు డైరెక్టర్ కార్తీక్‌ను ప్రేమించి ఈ ఏడాది మార్చి 24న తేదీన ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చెన్నైలో జరిగిన వీరిద్దరి వివాహ వేడుకలకు సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరై సందడి చేశారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా, ఇంద్రజ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ గుడ్ న్యూస్ షేర్ చేస్తూ పోస్ట్ పెట్టింది. పెళ్లైన 6 నెలలకే తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ‘‘అవును.. మేము తల్లిదండ్రులం కాబోతున్నాము. పేరెంట్‌హుడ్‌లోకి ప్రవేశించడం ఒక ఆనందం. మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఉద్వేగానికి లోనవుతున్నాను.. మాట తప్పుతున్నాను.. నాతో ఎల్లప్పుడూ ఉన్నందుకు ధన్యవాదాలు మామా.. లవ్ యూ’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా తన భర్తతో కలిసి తీసుకున్న ఫొటోలు షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన వారంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
(Video Link Credits to indraja sankar Instagram Channel)
- Tags
- Indraja Shankar






