- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
థియేటర్లను బ్లాస్ట్ చేసేందుకు సిద్ధమైన స్టార్ బాయ్.. ఆ బ్యానర్‌లో ముచ్చటగా మూడోసారి
టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ లభించింది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ లభించింది. సిద్ధు తన కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ షేర్ చేశారు. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ వంటి సెన్సేషనల్ హిట్స్ తర్వాత సిద్ధు-సితార కాంబినేషన్‌లో మరో మూవీ రాబోతుండటంతో టాలీవుడ్‌లో ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ.. చిత్రబృందం షేర్ చేసిన క్యాప్షన్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘‘మళ్ళీ తన పాత ఫామ్‌లోకి వస్తాడు... ఈసారి, అతను మరోసారి తెరలను షేక్ చేయబోతున్నాడు’’ అని రాసుకొచ్చారు.
సిద్ధు తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తన పుట్టినరోజు రోజే ఈ బిగ్ అనౌన్స్‌మెంట్ రావడంతో సిద్ధు జొన్నలగడ్డకు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. కాగా.. గత ఏడాది సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘తెలుగు కదా’ చిత్రం ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. అయితే, ఆ ఫలితంతో ఏమాత్రం నిరాశ చెందకుండా సిద్ధు ఇప్పుడు ఒక పక్కా కమర్షియల్ స్క్రిప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ కొత్త చిత్రానికి స్వరూప్ దర్శకత్వం వహిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర ప్రొడక్షన్స్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది ఈ బ్యానర్‌లో రాబోతున్న 40వ సినిమా.






