- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందరినీ శాసించే రాజు రాకకు రంగం సిద్ధమైంది.. ‘వా వాతియార్’ విడుదలపై మేకర్స్ పోస్ట్
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ(Karthi) వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘వా వాతియార్’ (VaaVaathiyaar)ఒకటి.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ(Karthi) వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘వా వాతియార్’ (VaaVaathiyaar)ఒకటి. నలన్ కుమారస్వామి(Nalan Kumaraswamy) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఇందులో కార్తీ సరసన టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి శెట్టి(Kriti Shetty) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో సత్యరాజ్, రాజ్ కిరణ్, ఆనందరాజ్, శిల్పా మంజునాథ్, కరునాకరణ్, సుందర్, రమేష్ తిలక్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమా ప్రకటించి దాదాపు రెండేళ్లు అవుతున్నప్పటికీ విడుదల నోచుకోలేదు. ఇప్పటికే ‘వా వాతియార్’ నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. కానీ మూవీ మేకర్స్ విడుదల తేదీని ప్రకటించలేదు.
ఈ ఏడాది జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో ‘వా వాతియార్’పై అభిమానులు ఆశలు వదులుకున్నారు. విడుదల కష్టమే అంది నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ‘వా వాతియార్’ సినిమా విడుదలపై అధికారిక ప్రకటన చేశారు. ఈమూవీ ఈ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుపుతూ కార్తీ పోస్టర్‌తో అంచనాలను పెంచారు. ఇందులో గుర్రంపై కూర్చున్న కార్తీ వర్షంలో వస్తున్నట్లు ఉంది. ఇక ఈ పోస్ట్‌కు ‘‘అందరినీ శాసించే రాజు రాకకు రంగం సిద్ధమైంది.. ఈ డిసెంబర్‌లో వాతావరణం మారబోతోంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న కార్తీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.






