చెన్నై థియేటర్‌లో దారుణం.. సంచార జాతిని అవమానించిన సిబ్బంది

by Disha Web Desk 7 |
చెన్నై థియేటర్‌లో దారుణం.. సంచార జాతిని అవమానించిన సిబ్బంది
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో శింబు నటించిన ‘పత్తు తల’ శ్రీరామనవమి సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. దీంతో ఉదయం 8 గంటలకు సినిమా బెన్‌ఫిట్ షో ప్రదర్శించారు మేకర్స్. భారీగా తరలివచ్చిన శింబు అభిమానులు తెల్లవారు జాము నుంచి థియేటర్‌లో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా చూసేందుకు వచ్చిన సంచార జాతి ‘నరిక్కువర్’ వర్గానికి చెందిన వారిని లోపలికి రానివ్వకుండా థియేటర్ సిబ్బంది అడ్డుకుంది. టికెట్టు ఉందని, తమను అనుమతించాలని వాళ్లు ప్రాధేయపడినా నిర్వాహకులు కనికరించలేదు. అయితే ఇందుకు సంబంధించిన ఇష్యూను వీడియో తీసి శింబు అభిమానులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయాంశమైంది.


Next Story

Most Viewed