- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం నుంచి 'నా పేరు శంబాల' సాంగ్ రిలీజ్
ర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ (Adi Sai Kumar)నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ (Shambhala: A Mystical World)మాత్రం విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేసింది.

దిశ, సినిమా: వెర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ (Adi Sai Kumar)నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ (Shambhala: A Mystical World)మాత్రం విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేసింది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి యుగంధర్ ముని (Yugandhar Muni)దర్శకత్వం వహించారు. అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు నటించిన ఈ మూవీ బిజినెస్ ఇప్పటికే పూర్తి అయింది. ఫాన్సీ రేటుకే ఈ సినిమాని మేకర్స్ అమ్మేశారు. శంబాల అంటూ టైటిల్ ప్రకటించిన క్షణం నుంచి ఈ చిత్రం ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన కంటెంట్, విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, మేకింగ్ వీడియో, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.
డిఫరెంట్ ప్రమోషన్స్ తో శంబాల టీం జనాల్లోకి దూసుకుపోతోంది. డిసెంబర్ 25 న శoబాల బ్లాక్ బస్టర్ కానుందని అంతా ఫిక్స్ అయ్యారు. ఈక్రమంలో.. తాజాగా, మేకర్స్ ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేసి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ‘నా పేరు శంబాల’ అంటూ సాగే ఈ పాటను గీతా మాధురి ఆలపించారు. కిట్టు విస్సాప్రగడ రాసిన లిరిక్స్, శ్రీ చరణ్ పాకాల ఇచ్చిన బాణీ అందరినీ హత్తుకునేలా ఉంది. ఇక స్పెషల్ గా షూట్ చేసిన లిరికల్ వీడియో, అందులో గీతా మాధురి కనిపించిన తీరు అందరినీ కట్టిపడేస్తుంది.






