‘కొత్తగా ఓ రెండు తారలే’ సాంగ్ రిలీజ్.. మెస్మరైజ్ చేస్తున్న లిరిక్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-23 15:38:21  IST  )

ఈషా రెబ్బా(Eesha Rebba), అనన్య నాగళ్ల(Ananya Nagalla), నందిని రాయ్, దినేశ్‌ తేజ్, అజయ్‌ కతుర్వార్, యశ్విన్‌ వేగేశ్నలు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘కథాకేళి’(kathakeli).

‘కొత్తగా ఓ రెండు తారలే’ సాంగ్ రిలీజ్.. మెస్మరైజ్ చేస్తున్న లిరిక్స్
X

దిశ, సినిమా: ఈషా రెబ్బా(Eesha Rebba), అనన్య నాగళ్ల(Ananya Nagalla), నందిని రాయ్, దినేశ్‌ తేజ్, అజయ్‌ కతుర్వార్, యశ్విన్‌ వేగేశ్నలు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘కథాకేళి’(kathakeli). నేషనల్‌ అవార్డు విన్నర్‌ సతీష్‌ వేగేశ్న స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు నిర్వహించుకుంటుంది. ఈక్రమంలో.. చిత్రబృందం అజయ్, అనన్య నాగళ్లపై చిత్రీకరించిన ‘‘కొత్తగా ఓ రెండు తారలే’’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటను స్టార్‌ సింగర్‌ కోయిలమ్మ చిత్రగారు ఆలపించటంతో సినిమాకు మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది. చిత్రయూనిట్‌ సోమవారం ఈ పాటను సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేయగా.. నెటిజన్లను లిరిక్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో భానుశ్రీ, ఆయుషి పటేల్, పూజా ఝవేరి, విరాట్, రవివర్మ గూడూరి, ప్రవీణ్, ప్రభు, జెమిని సురేశ్, చింటు, రచ్చ రవి, ముక్కు అవినాష్, భద్రం, జబర్ధస్త్‌ నాగి, ఉషశ్రీ తదితరులు నటించారు. త్వరలోనే థియేటర్స్‌లోకి రాబోతుంది.

Next Story