- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ్ చరణ్ హుక్ స్టెప్.. జాన్వీ ఘాటు అందాలతో సోషల్ మీడియా షేక్ చేస్తున్న ‘చికిరి.. చికిరి’ సాంగ్
మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’(peddi). ఈ సినిమా నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్రబృందం ఒక్క పాటతో ఫుల్ మీల్స్ పెట్టి ఆకలి తీర్చారు.

దిశ, సినిమా: మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’(peddi). ఈ సినిమా నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్రబృందం ఒక్క పాటతో ఫుల్ మీల్స్ పెట్టి ఆకలి తీర్చారు. ‘పెద్ది’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘చికిరి..చికిరి’ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఇందులో రామ్ చరణ్ (Ram Charan)హుక్ స్టెప్ వేసి దుమ్మురేపారు. జాన్వీ తన ఘాటు అందాలు చూపించి కుర్రాళ్లకు చెమటలు పట్టేలా చేసింది. ఈ పాటకు బాలాజీ లిరిక్స్ అందించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం జత చేర్చగా అద్భుతంగా వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విడుదలైన కొద్ది క్షణాల్లోనే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
బుచ్చిబాబు సనా (Buchibabu Sana)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. దివ్యేందు శర్మ, జగపతి బాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రాబోతుండగా..మైత్రీ మూవీ మేకర్స్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ప్రొడక్షన్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదల కాబోతుంది.






