రామోజీ ఫిల్మ్ సిటీలో ముగిసిన Pawan Kalyan సినిమా షూటింగ్!

by Disha Web Desk 2 |
రామోజీ ఫిల్మ్ సిటీలో ముగిసిన Pawan Kalyan సినిమా షూటింగ్!
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం హరిహర వీరమల్లు. పవర్ స్టార్ కెరీర్‌లో భారీ బడ్జెట్ చిత్రంగా హరిహర వీరమల్లు తెరకెక్కుతోంది. మొగలుల కాలంనాటి చిత్రం కావడంతో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అయితే, ఇప్పటివరకు రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ చిత్ర షూటింగ్‌ ముగిసింది. ఈ విషయాన్ని దర్శకుడు క్రిష్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అంతేగాక, తదుపరి షెడ్యూల్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ షూటింగ్‌లో చురుగ్గా పాల్గొని, అనుకున్న సమయానికి షూటింగ్‌ పూర్తయితే వచ్చే సమ్మర్‌లో సినిమా విడుదల కానుంది. భారీ చిత్రాల దర్శకుడు ఏఎమ్ రత్నం ఈ సినిమాను నిర్మిస్తుండగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Also Read...

హీరో నాగార్జునకు నోటీసులు.. షాక్‌లో అక్కినేని ఫ్యామిలీ



Next Story

Most Viewed