జూన్ 6న ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్.. అదే రోజు సెకండ్ ట్రైలర్ కూడా

by Disha Web Desk 6 |
జూన్ 6న ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్.. అదే రోజు సెకండ్ ట్రైలర్ కూడా
X

దిశ, సినిమా: ప్రభాస్ హీరోగా నటిస్తున్న వరుస పాన్ ఇండియా చిత్రాల్లో ‘ఆదిపురుష్’ ఒకటి. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమాకి ఓం రౌత్ దర్శకత్వం వహించగా, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ సీతమ్మగా నటించింది. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ జూన్16న విడుదల కానుంది. కాగా జూన్ 6న సాయంత్రం 5 గంటలకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఈవెంట్‌లోనే మూవీకి సంబంధించిన రెండో ట్రైలర్‌ని లాంచ్ చేయనున్నారు. 30 సెకండ్స్‌లోపు ఉండే ఈ ట్రైలర్, ఫస్ట్ ట్రైలర్ కంటే ఎన్నో రేట్లు హైప్ ఇచ్చేలా ఉంటుందట.

Read More: ‘సలార్’ షూటింగ్ సెట్‌లో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన ప్రభాస్

Next Story

Most Viewed