- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘వానర’ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్
అవినాష్ తిరువీధుల (Avinash Tiruveedhula)హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘వానర’(vanara).

దిశ, సినిమా: అవినాష్ తిరువీధుల (Avinash Tiruveedhula)హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘వానర’(vanara). ఇందులో సిమ్రాన్ చౌదరి(Simran Choudhary) హీరోయిన్‌గా నటిస్తుండగా.. నందు విలన్‌గా కనిపించనున్నారు. ‘వానర’ చిత్రాన్ని శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్‌పై అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో తెరకెక్కిన ‘వానర’ సినిమా న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా, ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. సెకండ్ సింగిల్ ‘లబొరే లబొరే..’ రిలీజ్ చేశారు. రాహుల్ సిప్లిగంజ్, సాయి మాధవ్ ఎనర్జిటిక్‌గా పాడిన ‘లబోరే లబోరే’ లిరిక్స్.. సూడు సూడు మల్లేషు, జుర్రుకుంటా పుల్లైసు, మన వానర వీరుని కహానీ, ఆ లంకను భయపెట్టిన శివుడిని, అరె తోక తోటి కొట్టింది, సింహిక పనిపట్టింది, అనిలాత్మజ హనుములవారే, అరె జెండాపై కపిరాజే రే, లబొరే లబొరే లబ లబ లబ..’ అంటూ ఆకట్టుకుంటున్నాయి.






