‘మోగ్లీ’ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-23 15:55:08  IST  )

బబుల్గమ్‌తో సక్సెస్ ఫుల్ డెబ్యు చేసిన యంగ్ హీరో రోషన్ కనకాల(Roshan Kanakala) తన సెకండ్ మూవీ 'మోగ్లీ' (Mowgli)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

‘మోగ్లీ’ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో
X

దిశ, సినిమా: బబుల్గమ్‌తో సక్సెస్ ఫుల్ డెబ్యు చేసిన యంగ్ హీరో రోషన్ కనకాల(Roshan Kanakala) తన సెకండ్ మూవీ 'మోగ్లీ' (Mowgli)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత, కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్(Sandeep Raj) దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. అడవి నేపథ్యంలో యూనిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ మేకర్స్ సెకండ్ సింగిల్ ‘వనవాసం’ సాంగ్‌ను రిలీజ్ చేశారు.

కాల భైరవ స్వరపరిచిన ఈ పాటలో భావోద్వేగం పురాణ చిహ్నాలతో ఇంటెన్స్‌గా కనిపిస్తుంది. రామాయణంలో పవిత్రమైన ప్రదేశంగా నిలిచిన అడవి మోగ్లీ జర్నీకి నేపథ్యంగా నిలిచింది. యుద్ధాన్ని తలపించేలా కాల భైరవ కంపోజిషన్‌ పవర్ ఫుల్‌గా ఉంది. కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ ఇతిహాస వైభవాన్ని, ఆధునిక ప్రేమ-సంఘర్షణ కథను అద్భుతంగా మేళవిస్తూ కవితాత్మకంగా రాశారు. శ్రీరాముడు సీతమ్మ వారిని రక్షించేందుకు యుద్ధానికి వెళ్లినట్లే… హీరో కూడా తన ప్రేమను కాపాడేందుకు సిద్ధం అవుతున్నాడనే భావనను భావోద్వేగంతో చిత్రీకరించారు.

కాల భైరవ, సోనీ కోమండూరి వోకల్స్ ఫైర్ ని జోడించినట్లుగా, ప్రతి బీట్‌లోని డ్రామా మరింత ఎత్తుకు చేరుతుంది. రోషన్, సాక్షి మడోల్కర్ కెమిస్ట్రీ అందంగా కనిపిస్తుంది. బండి సరోజ్ కుమార్ పవర్ ఫుల్ విలన్‌గా కనిపించగా, వైవా హర్ష హీరో మిత్రుడిగా వినోదాన్ని పంచుతున్నారు.ఈ చిత్రం డిసెంబర్ 12న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

Next Story