- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ది రాజాసాబ్’ సినిమాపై ఊపందుకున్న వార్తలు.. ఎట్టకేలకు స్పందించి క్లారిటీ ఇచ్చిన నిర్మాత
రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ ‘ది రాజాసాబ్’(The Raja Saab).

దిశ, సినిమా: రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ ‘ది రాజాసాబ్’(The Raja Saab). మారుతి(maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హారర్, రొమాంటిక్, కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ప్రభాస్ మొదటిసారి నటిస్తుండటంతో అందరి దృష్టి ‘ది రాజాసాబ్’పై పడింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ నటిస్తుండటం విశేషం. షూటింగ్ పూర్తయిన ఈ మూవీ.. సంక్రాంతి కానుకగా.. వచ్చే ఏడాది జనవరి 9న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన వార్తలెన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెబల్ స్టార్ మూవీ కావడంతో టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. రిలీజ్‌కు ముందే బిజినెస్ డీల్స్‌పై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ‘ది రాజాసాబ్’ నాన్ థియేట్రికల్ బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగలేదనే పుకార్లు షికారు చేస్తున్నాయి.
అంతేకాకుండా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ అంచనాలను అందుకోలేకపోయాయని కామెంట్లు వస్తున్నాయి. తాజాగా, ఈ విషయాపై ‘ది రాజాసాబ్’ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యారు. ‘‘మా అతిపెద్ద సినిమా ‘ది రాజాసాబ్’అంతర్గత లెక్కల గురించి బయటకు చెప్పాలనుకోవడం లేదు. మా మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత వచ్చే లెక్కలను అధికారికంగా ప్రకటిస్తాము. సినిమా రంగం అనేది దశలవారీగా మారుతూ ఉంటుంది. ఈ రోజుల్లో నాన్ థియేట్రికల్ మార్కెట్‌లో సాధారణంగా సర్దుబాట్లు జరుగుతుంటాయి. థియేటర్లలో విలువను మాత్రమే అసలైన నంబర్స్ వస్తాయి. అయినప్పటికీ కూడా మా సినిమా ఈ రోజు అత్యధిక నాన్ థియేట్రికల్ విలువను సాధించింది. ది రాజాసాబ్’కు పోలికలు అనవసరమైనవి’’ అని రాసుకొచ్చారు. దీంతో తప్పుడు వార్తలకు చెక్ పడినట్లు అయింది.






