- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పెద్ది’లోని పాత్ర నా కెరీర్‌కు మరింత బూస్ట్ ఇస్తుంది.. ఆయనతో నటించడం నా అదృష్టం: జాన్వీ
బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) భాషతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తుంది.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) భాషతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)సరసన ‘పెద్ది’(peddi)లో నటిస్తోంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. ఇందులో దివ్యేందు శర్మ, జగపతి బాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘పెద్ది సినిమా అనుభవాన్ని నేను మాటల్లో చెప్పలేను. బుచ్చిబాబు గారితో పని చేయడం ఒక అదృష్టం. ‘ఉప్పెన’ వంటి హార్ట్ టచ్చింగ్ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఈ మూవీలో నేను సాంప్రదాయ హీరోయిన్ పాత్రలో కాకుండా భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాను. చాలా ఆసక్తికరంగా ఉంటుంది.. ఇది నా కెరీర్‌కు మరింత బూస్ట్ ఇస్తుందని భావిస్తున్నాను. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. రామ్ చరణ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ, సెట్‌తో మాత్రం ప్రతీదీ నేర్చుకుంటున్న విద్యార్థిలాగే ఉంటారు. ఆయనలో కష్టపడే తత్వం, ఎనర్జీ, అంకితభావం చూపతూ పని చేయడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా.సెట్‌లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






