‘ఖుషి’ రివ్యూ.. మూవీ కంటెంట్‌కు సెన్సార్ సభ్యులు ఫిదా?

by samatah |
‘ఖుషి’ రివ్యూ.. మూవీ కంటెంట్‌కు సెన్సార్ సభ్యులు ఫిదా?
X

దిశ, సినిమా: శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత రూత్ ప్రభు జంటగా నటించిన తాజా చిత్రం ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ మూవీ సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది. ఇక ప్రమోషన్‌లో భాంగంగా టీజర్‌తో పాటు కొన్ని పాటలు విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే విడుదల సమయం దగ్గర పడటంతో తాజాగా ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలిసింది. దీనికి సెన్సార్ బోర్డ్ సభ్యులు క్లీన్ యూ (U) సర్టిఫికెట్‌ను కూడా జారీ చేశారు. ఇక ‘ఖుషి’ మూవీని వీక్షించిన సెన్సార్ సభ్యులు ఈ కంటెంట్‌కు ఫిదా అయ్యారట. ముఖ్యంగా ఇందులో ఫ్యామిలీ, యూత్‌కు కనెక్ట్ అయ్యే ఎన్నో అంశాలను చూపించారని, మొత్తంగా ఈ చిత్రం అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకుటుందని సెన్సార్ సభ్యులు వెల్లడించినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Read More: 'Khushi' సినిమా కోసం Vijay Deverakonda రెమ్యునరేషన్ అన్ని కోట్లు తీసుకున్నాడా?


Next Story

Most Viewed