- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిట్ మూవీ సీక్వెల్ రిలీజ్ తేదీ ఖరారు.. ప్రేమ పురాణం మళ్లీ తిరిగి వస్తుందంటూ యంగ్ బ్యూటీ పోస్ట్
బాలీవుడ్ యంగ్ బ్యూటీ సోనమ్ బజ్వా(Sonam Bajwa) వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ ఫామ్‌లో ఉంది.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ సోనమ్ బజ్వా(Sonam Bajwa) వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ ఫామ్‌లో ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు సీక్వెల్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బోర్డర్-2, భాఘీ-4 వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా, ఓ హిట్ మూవీ సీక్వెల్‌పై అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘నిక్కా జైల్దార్-4’(Nikka Jaildar-4) సినిమా విడుదల డేట్ ప్రకటిస్తూ పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ చిత్రం ఘన విజయం సాధించిన ‘నిక్కా జైల్దార్-3’ కి సీక్వెల్‌గా రాబోతుంది. సిమర్‌జిత్ సింగ్(Simarjit Singh) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అమ్‌నీత్, రామ్‌నీత్ నిర్మించారు.
ఇందులో నిషాబానో, సుఖి చాహల్, గుమ్‌నీత్ సాజన్, కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చిలో విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్స్‌లోకి రాబోతోంది. ఈ విషయాన్ని రివీల్ చేస్తూ సోనమ్ ‘‘నవ్వు.. ప్రేమ.. పురాణం తిరిగి వస్తుంది! ‘నిక్కా జైల్దార్-4’తో మస్తీ, పిచ్చిని ఒకేసారి చూస్తారు. కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది.. ట్రైలర్ త్వరలో మీ ముందుకు వస్తుంది. 12 సెప్టెంబర్ 2025న సినిమాల్లోకి రాబోతోంది’’ అని రాసుకొచ్చింది.






