‘డెకాయిట్’ టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. హైప్ పెంచుతున్న పోస్ట్

by Mallepaka Hamsa |

టాలీవుడ్‌లో ఆసక్తికరమైన సినిమాల జాబితాలో ‘డెకాయిట్’(Dacoit) ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

‘డెకాయిట్’ టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. హైప్ పెంచుతున్న పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో ఆసక్తికరమైన సినిమాల జాబితాలో ‘డెకాయిట్’(Dacoit) ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అడివి శేష్(adivi sesh) హీరోగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ డిసెంబర్ 18న రాబోతున్న వార్త బయటకు రావడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. బ్లాస్ట్ చేయబోతుందంటూ పెట్టిన ఓ పోస్ట్‌తో సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది. ఈ టీజర్‌లో అడివి శేష్ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. రా అండ్ ఇంటెన్స్ యాక్షన్, ఎమోషనల్ డెప్త్ కలిసిన పాత్రలో శేష్ కనిపించనున్నాడని సమాచారం. ముఖ్యంగా ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్ టీజర్‌లో ప్రధాన హైలైట్‌గా నిలవబోతున్నాయట. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాపై అంచనాలను మరో లెవల్‌కు తీసుకెళ్లేలా ఉండనుందని అంటున్నారు.

దర్శకుడు ఈ సినిమాను పూర్తిగా స్టైలిష్ యాక్షన్ డ్రామాగా మలుస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. టీజర్ ద్వారా కథా నేపథ్యం, హీరో క్యారెక్టర్ షేడ్స్‌ను కేవలం కొన్ని సెకన్లలోనే ఇంప్రెస్ చేసేలా చూపించనున్నారట. విజువల్స్, మేకింగ్ విలువలు పాన్ ఇండియా స్థాయికి తగ్గట్లుగా ఉంటాయని మేకర్స్ ధీమాగా చెబుతున్నారు. మొత్తానికి ‘డెకాయిట్’ టీజర్ అప్డేట్‌తో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. కాగా.. ‘డెకాయిట్’ మూవీలో అడివి శేష్ సరసన మృణాల్ హీరోయిన్‌గా కనిపించనుంది. షానిల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది మార్చి 19న ఉగాది పండుగ కానుకగా విడుదల కాబోతుంది.

link

Next Story