ఆయన వల్లే మేము ఇంకా బతికున్నాం.. మ్యూజిక్ డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో(Bheem's Cicerolio) తన సంగీంతో జనాలు మైమరచి పోయేలా చేస్తున్నారు.

ఆయన వల్లే మేము ఇంకా బతికున్నాం.. మ్యూజిక్ డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో(Bheem's Cicerolio) తన సంగీంతో జనాలు మైమరచి పోయేలా చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతర’ (mass jathara)చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా అక్టోబర్ 31న విడుదల కాబోతుండగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఇందులో పాల్గొన్న భీమ్స్ కుటుంబమంతా చనిపోదామనుకునే సమయంలో రవితేజ(raviteja) అవకాశం ఇచ్చినట్లు తెలుపుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ‘‘నేను ధమాకా చేసినప్పటి నుంచి చిరంజీవి సర్ సినిమా చేసే వరకు ప్రతి పాట వెనుక, ప్రతి ప్రోత్సాహం వెనుక ఓ వ్యక్తి ఉన్నారు. నేను ఓ పాట పాడుతూ సెల్ ఫోన్‌లో వీడియో తీసుకుంటున్న సమయంలో నా భార్యా, పిల్లలకు అది ఎందుకు తీస్తున్నానో తెలియదు.

అప్పటికి ఇంటికి కిరాయి ఎలా కట్టాలి.. పిల్లలను ఎలా చదివించాలి అని బాధపడుతున్నాను. అప్పుడే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి నాకు ఫోన్ వచ్చింది. నాకు భూమి మీద నూకలు చెల్లిపోయాయి.. ఇక నేను, నా భార్యాపిల్లలతో కట్టగట్టుకొని పైకి వెళ్లిపోదామనుకున్నాను. అలాంటి సమయంలో ఓ దేవుడిలాగా, ఓ జీసస్ లాగా, ఓ అల్లాలాగా, రాముడిగా, తిరుపతి వెంకన్న నా జీవితంలో ఓ వ్యక్తి వచ్చారు. నన్ను ఆదుకున్న దేవుడు.. నా కోసం నిలబడిన వ్యక్తి, శక్తి, వ్యవస్థ రవితేజ గారు. ఇవాళ నేను సజీవంగా ఉండటానికి కారణం రవితేజ సర్’’ అని అన్నాడు. కాగా.. ఈ సినిమా భాను భోగవరపు దర్శకత్వంలో రాబోతుంది.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఎన్నో సార్లు వాయిదా పడిన ‘మాస్ జాతర’ ఎట్టకేలకు అక్టోబర్ 31న రాబోతుంది. కానీ విజయం అందుకోవడం కష్టమే. ఎలాగైనా హిట్ కొట్టాలన్న ఆశతో వస్తున్నారు టీమ్. కానీ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో హెచ్చరికలు జారీ చేయగా.. తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలకు జనాలు థియేటర్స్‌కు కాదుగా ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకే వణికిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ‘మాస్ జాతర’ విడుదల అవుతుందా? లేక వాయిదా వేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story