ఈ విజయానికి కారణం పేరు మార్పే.. అదృష్టం కలిసివచ్చిందంటూ రిషబ్ శెట్టి కామెంట్స్

by Mallepaka Hamsa |

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishabh Shetty)స్వీయ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘కాంతార: చాప్టర్1’.

ఈ విజయానికి కారణం పేరు మార్పే.. అదృష్టం కలిసివచ్చిందంటూ రిషబ్ శెట్టి కామెంట్స్
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishabh Shetty)స్వీయ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘కాంతార: చాప్టర్1’. రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలై ఘన విజయం సాధించింది. రెండు వారాల్లోనే రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ బాక్సాఫీసును షేక్ చేసింది. కన్నడతో పాటు అన్ని భాషల్లో విడుదలైన ఈ మూవీ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఈక్రమంలో.. రిషబ్ శెట్టి వరుస ఇంటర్వ్యూ్ల్లో పాల్గొంటున్నారు. తాజాగా, ఆయన ఓ విషయాన్ని వెల్లడించారు.

‘‘నా అసలు పేరు ప్రశాంత్ కానీ నేను రిషబ్ శెట్టిగా మార్చుకున్నాను. సినిమా రంగంలో రాణించాలన్న కోరికతో అలా చేశాను. మా నాన్న సలహాతో అలా చేశా. ఆయన పెద్ద జ్యోతిష్యుడు కాబట్టి నా జాతకం ప్రకారం రిషబ్ అని పెట్టుకోవాలని సూచించారు. నిజంగా పేరు మార్చుకున్న తర్వాత అదృష్టం కలిసివచ్చింది. మొదట నేను కూడా అందరి లాగానే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. కానీ పేరు మారిన తర్వాత నా లైఫ్ కొంచెం మారుతై వచ్చింది. ‘కాంతార’ (Kantara)ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

Next Story