Sudigali Sudheer : నా సక్సెస్‌కు కారణం రష్మీనే.. సుధీర్ ఎమోషనల్ కామెంట్స్

by Disha Web Desk 9 |
Sudigali Sudheer : నా సక్సెస్‌కు కారణం రష్మీనే.. సుధీర్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ షోలో బుల్లితెరపై కామెడీ పంచ్‌లతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ కడుపుబ్బా నవ్విస్తాడు సుడిగాడి సుధీర్. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్.. సాఫ్ట్ వేర్ సుధీర్, గాలోడు, త్రీ మంకీస్ వంటి చిత్రాల్లో నటించారు. ఇక రష్మీతో కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. నిజంగా లవర్సో కాదో తెలియదు కానీ.. వీరిద్దరు బుల్లితెరపై కనిపిస్తే ఆడియన్స్‌కు మాత్రం పండగే. తాజాగా సుధీర్-రష్మి ప్రముఖ ఛానల్‌కు చెందిన వార్షికోత్సవ వేడుకకు హాజరయ్యారు. అందులో వీరిద్దరి ఓల్డ్ వీడియోస్‌ను ప్రదర్శించడంతో వీరు చాలా ఎమోషనల్ అయ్యారు.

‘‘రష్మితో నాది బ్యూటీఫుల్ జర్నీ. బేసిక్‌గా తను కష్టపడే మనస్తత్వం కలిగిన అమ్మాయి. నాకు అందరికంటే రష్మినే ఎక్కువ. నిజం చెప్పాలంటే నా సక్సెస్‌కు ముఖ్య కారణం ఆమెనే.’’ అంటూ సుధీర్ కాస్త ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు. ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను సుధీర్ సక్సెస్‌కు కారణం. వీరు ముగ్గురు కలిసి చేసిన స్కిట్స్ ప్రతిసారి హైలెట్ అయ్యాయి. ఫ్రెండ్స్‌కే వెన్నుపోటు పొడిచాడుగా.. అంటూ నెటిజన్లు పెడుతున్నారు.

Read More: 20 ఏళ్ల తర్వాత ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన స్నేహ..



Next Story

Most Viewed