‘మాయే చేసి’.. ఆకట్టుకుంటున్న ‘Devil’ ఫస్ట్ సింగిల్ ప్రోమో

by Disha Web Desk 10 |
‘మాయే చేసి’.. ఆకట్టుకుంటున్న ‘Devil’ ఫస్ట్ సింగిల్ ప్రోమో
X

దిశ, సినిమా: నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్‌, అభిషేక్ నామా కాంబోలో వస్తున్న చిత్రం ‘డెవిల్’. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్‌ ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీ క్రియేట్‌ చేయగా తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు సినిమా ఫస్ట్‌ సింగిల్‌ ‘మాయే చేసి’ ప్రోమోను రిలీజ్‌ చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ స్వర పరిచిన ఈ పాటను సిద్ శ్రీరామ్‌ ఆలపించగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోను సెప్టెంబర్ 19న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించగా.. దేశ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా డెవిల్‌ ముసుగేసుకుని బ్రిటీషర్ల కోసం కళ్యాణ్‌ రామ్ ఎందుకు పని చేశాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా ఈ సినిమాను నిర్మిస్తుండగా నవంబరు 24న ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇవి కూడా చదవండి : Chandramukhi-2 రన్ టైమ్ ఫిక్స్.. బాబోయ్ అన్ని గంటలా..!



Next Story

Most Viewed