‘ఉస్తాద్ భగత్‌సింగ్’ డబుల్ వినోదాన్ని అందిస్తుంది.. విడుదలపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

by Mallepaka Hamsa |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), హరీష్ శంకర్ (Harish Shankar)కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’(Ustad Bhagat Singh).

‘ఉస్తాద్ భగత్‌సింగ్’ డబుల్ వినోదాన్ని అందిస్తుంది.. విడుదలపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), హరీష్ శంకర్ (Harish Shankar)కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’(Ustad Bhagat Singh). ఈ చిత్రంలో శ్రీలీల పవర్ స్టార్ సరసన హీరోయిన్‌గా నటిస్తుండగా.. రాశీఖన్నా కీలక పాత్రలో కనిపించనుంది. దీనిని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచలి రవిశంకర్, నవీన్ యెర్నేనీ నిర్మిస్తున్నారు. అయితే దాదాపు షూటింగ్ 80శాతం పూర్తి చేసుకోగా.. మిగతాది పవన్ కళ్యాణ్ పొలిటికల్ కమిట్‌మెంట్స్ కారణంగా వాయిదా పడింది. దీంతో చిత్రబృందం విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వకపోవడంతో పవన్ అభిమానులంతా నిరాశ చెందుతున్నారు. వచ్చే ఏడాదికి కూడా రిలీజ్ చేస్తారో లేదో అని ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ మూవీ ఈవెంట్‌లో పాల్గొన్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ నిర్మాత రవిశంకర్ ఈ సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చి అభిమానులకు పండుగలాంటి అప్డేట్ ఇచ్చారు.

‘‘మీరు ‘ఓజీ’ సినిమాను ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ డబుల్ వినోదాన్ని అందిస్తుంది. పవన్ కళ్యాణ్‌కు అభిమాని అయిన హరీష్ శంకర్ తన ఫేవరేట్ యాక్టర్‌కు అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందించేందుకు చాలా కష్టపడుతున్నారు. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ వచ్చే ఏడాది ఏప్రిల్ 26న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. సినిమా విడుదలయ్యాక అన్ని రికార్డులు ఉస్తాద్ కిందకే వస్తాయి. ఏ ప్లేస్‌లో మాట్లాడిన ఏ జిల్లా రికార్డ్స్ మాట్లాడిన వినిపించే ఏకైక పేరు కేవలం ‘ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమానే అవుతుంది’’ అని చెప్పుకొచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఫుల్ జోష్ మొదలైంది. అలాగే ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది. ఎప్పుడెప్పుడు వస్తుందా.. చూసి ఎంజాయ్ చేద్దామా? అని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు.

Next Story