- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండస్ట్రీలో హీరోలకు ఇచ్చినంత ప్రాధాన్యత హీరోయిన్స్‌కు ఇవ్వరు.. అనుపమ సెన్సేషనల్ కామెంట్స్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ‘పరదా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ‘పరదా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రవీణ్ కండ్రేగుల(Praveen Kandregula) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంగీత, దర్శన రాజేంద్రన్ (Darshana Rajendran)కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 22న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో అనుపమ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ‘‘సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్‌గా కొనసాగడం అంత సులభం కాదు. చిన్న చిన్న విషయాలకే అటిట్యూడ్ చూపిస్తున్నారని అంటారు. మేము ఎంత తొందరగా సెట్‌కి వెళ్లినా లేట్‌గా పని మొదలుపెడతారు. అదే హీరోలు లేట్‌గా వచ్చినా అది తప్పు కాదు. కానీ నేను ప్రశ్నిస్తే పొగరు అంటారు.
అలా అనడంతో గతంలో చాలా బాధపడ్డాను. ఇప్పుడు పట్టించుకోవడం మానేశాను. అదే విషయాన్ని దర్శకనిర్మాతలకు చెప్పినా సరైన సమాధానం చెప్పరు. గంటన్నరలోనే చాలా మాట్లాడుకోవచ్చు కానీ ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. అదే విషయాన్ని హీరోయిన్స్ అడిగితే నా డబ్బులే కదా నీకెందుకు అంటారు. అదే హీరోలు ప్రశ్నిస్తే వారిని ఏమనరు. మహిళలతో కొందరు బయట ఎలా ప్రవర్తిస్తారో సినీ ఇండస్ట్రీలోనూ అలాగే చేస్తారు. ఏది చేసినా తప్పుగా చూస్తారు.ఇండస్ట్రీలో హీరోలకు ఇచ్చినంత ప్రాధాన్యత హీరోయిన్స్‌కు ఇవ్వరు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






