- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Parugu: ఐకాన్‌స్టార్ నటించిన ‘పరుగు’ చిత్రానికి ముందు అనుకున్న టైటిలిదే?
ఐకాన్ స్టార్ అల్లున్ (Icon Star Allun) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లున్ (Icon Star Allun) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. గంగోత్రి (Gangotri), జులాయి (Julayi), ఎవడు, సన్నాఫ్ సత్యమూర్తి, దేశముదురు (Deśamuduru), ఆర్య, ఆర్య-2, హ్యాపీ (happy), బన్నీ వంటి ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందాడు. ముఖ్యంగా పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. పుష్ప రెండు భాగాల్లో నటించి.. బన్నీ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.
ఈ చిత్రానికి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు (National Award) కూడా సొంతం చేసుకున్నాడు. అయితే ఇంతటి స్టార్ హీరో అప్పట్లో పరుగు చిత్రంలో కూడా హీరోగా నటించిన విషయం తెలిసిందే. బొమ్మరిల్లు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన దర్శకుడు భాస్కర్ (Bhaskar) ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీలో ఐకాన్ స్టార్‌కు సరసన షీలా హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ ముప్పై కోట్లకు పైగా వసూల్లు సాధించింది.
అయితే పరుగు చిత్రానికి ముందుగా వేరే టైటిల్స్ పెట్టాలని అనుకున్నారట దర్శకనిర్మాతలు. ఎంతఘాటు ప్రేమయో, ప్రేమికుడు, అరకు వంటి టైటిల్స్ అనుకున్నారట. ఏవీ కూడా సెట్ అవ్వట్లేదని లాస్ట్‌గా వారధి అని ఫిక్స్ అయ్యారట. ఇగ టైటిల్ రిజిస్టర్ చేసి.. చిత్రీకరణకు వెళ్లాక హీరో పాత్ర, స్టోరీ,పలు డైలాగ్స్ చూశాక వారధి కంటే పరుగు టైటిల్ బెటర్ అని అనుకుని.. పరుగు అని చివరగా ఖరారు చేశారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






