‘ఏజెంట్’ను ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ చేస్తారు: నాగార్జున

by Disha Web Desk 7 |
‘ఏజెంట్’ను ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ చేస్తారు: నాగార్జున
X

దిశ, సినిమా : అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబోలో వస్తున్న చిత్రం ‘ఏజెంట్’. ఏప్రిల్ 28న రిలీజ్‌ కాబోతున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను వరంగల్‌లో గ్రాండ్‌గా నిర్వహించగా ముఖ్య అతిథులుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అక్కినేని నాగార్జున, మేయర్ గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ హాజరయ్యారు. ఈ మేరకు వరంగర్‌లో వేడుకలు జరపుకునే ప్రతి సినిమా విజయం సాధించినట్లే ‘ఏజెంట్’ కూడా బిగ్ హిట్ అవుతుదన్నారు మంత్రి.

‘వరంగల్ పోరాటాలకు అడ్డా. వీరత్వానికి ఇంటి పేరు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. కార్యక్రమానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు’ అని తెలిపాడు నాగార్జున. చివరగా అఖిల్, సురేందర్ రెడ్డి, అనిల్ సుంకర, సాక్షి వైద్య, డినో మోరియా మాట్లాడుతూ.. ప్రేక్షకులు ఆదరించి బిగ్‌ హిట్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామన్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా సినిమాను నిర్మించారు.

Also Read..

Agent Movie: 'ఏజెంట్' సినిమా మీద అఖిల్‌కు నమ్మకం లేదా?



Next Story

Most Viewed