ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న మూవీలో కీరోల్ ప్లే చేయనున్న పవర్ ఫుల్ స్టార్ హీరో.. హైప్ పెంచేస్తున్న పోస్ట్

by I. Sairam |   (  Updated:2025-04-25 09:16:02  IST  )

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న మూవీలో కీరోల్ ప్లే చేయనున్న పవర్ ఫుల్ స్టార్ హీరో.. హైప్ పెంచేస్తున్న పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘కల్కి 2898ఏడీ’(Kalki 2898AD) మూవీతో మన ముందుకు వచ్చి.. బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు. డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కించిన ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), కమల్ హాసన్(Kamal Haasan), దీపిక పదుకొణె(Deepika Padukone), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), దిశా పటానీ(Disha Patani), కీర్తి సురేష్(Keerthi Suresh) వంటి ప్రముఖులు కీ రోల్ ప్లే చేశారు. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.2000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

ప్రస్తుతం ప్రభాస్.. ‘ఫౌజీ’(Fouji), ‘కల్కి-2’(Kalki-2), ‘సలార్-2’(Salar-2), ‘రాజా సాబ్’(Raja Saab), ‘స్పిరిట్’(Spirit) వంటి భారీ బడ్జెట్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. డార్లింగ్ నటిస్తున్న ‘స్పిరిట్’ మూవీలో ఓ స్టార్ హీరో కీరోల్ ప్లే చేయబోతున్నాడనే విషయం నెట్టింట వైరల్‌గా మారింది. అతను మరెవరో కాదు ఉన్ని ముకుందన్(Unni Mukundan). మరి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్ కీరోల్ ప్లే చేస్తున్నాడంటే ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో ఇప్పటికే మనకు అర్థం అయిపోయి ఉంటుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ మూవీపై మరింత హైప్‌ను పెంచుతుంది.

Next Story