- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
The Paradise: నానితో రొమాన్స్ చేయబోతున్న క్రేజీ బ్యూటీ.. బొమ్మ బ్లాక్ బస్టరే అంటూ కామెంట్స్
న్యాచురల్ స్టార్ నాని(Nani) రీసెంట్‌గా ‘హిట్-3’(Hit-3) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: న్యాచురల్ స్టార్ నాని(Nani) రీసెంట్‌గా ‘హిట్-3’(Hit-3) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. వైల్డ్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక నాని తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) డైరెక్షన్‌లో ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి ‘ది ప్యారడైజ్’(The Paradise) అనే టైటిల్‌తో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichandar) సంగీతం అందిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
కాగా ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానీష్ భాషల్లో వచ్చే ఏడాది మార్చి 26న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ఈ మూవీకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. నానితో యంగ్ బ్యూటీ కయాదు లోహర్(Kayadu Lohar) రొమాన్స్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. వీరిద్దరి కాంబోలో మూవీ అంటే ఈ సారి బొమ్మ బ్లాక్ బస్టరే అంటూ ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.






