మే 25 నుంచి ఓటీటీలో ‘దసరా’ హిందీ వెర్షన్

by Dishanational2 |
మే 25 నుంచి ఓటీటీలో ‘దసరా’ హిందీ వెర్షన్
X

దిశ, సినిమా: నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించింది. తెలుగు రాష్ట్రాల్లో మెరుగైన కలెక్షన్లను సాధించినప్పటికీ ‘కేజీఎఫ్’, ‘పుష్ప’ చిత్రాల మాదిరి ఇతర రాష్ట్రాల్లో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ నుంచి స్ట్రీమిగ్ అవుతుండగా ఇప్పుడు హిందీ వెర్షన్ మే 25 నుంచి ప్రసారం చేయనున్నారు.

Also Read.. తిరుపతిలోనే ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్?

Pawan Kalyan romantic blockbuster Tholiprema : పవన్ కల్యాణ్ ‘తొలిప్రేమ’ రీ రిలీజ్

Next Story

Most Viewed