అల్లు అర్జున్‌లో మరో యాంగిల్.. ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ చేశాడట

by Dishafeatures2 |
అల్లు అర్జున్‌లో మరో యాంగిల్.. ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ చేశాడట
X

దిశ, సినిమా : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. తన నటనతో, వాక్చాతుర్యంతో అలరించే బన్నీకి ఇటు సినీ ఇండస్ట్రీలోనూ, అటు అభిమానుల్లోనూ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మెగా వారసుడిగా పరిశ్రమలో అడుగు పెట్టిన కొత్తలోనే అద్భుతమైన టాలెంట్‌ను ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు.

పుష్ప సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు ఊరమాస్ ఎంటర్టైన్మెంట్ అందించిన అల్లు అర్జున్ మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో దానికి సీక్వెల్‌గా పుష్ప -2 మూవీతోనూ మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం బన్నీ గురించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏంటంటే.. చాలా మందికి హీరోగానే తెలిసిన ఐకాన్ స్టార్‌ గతంలో ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ చేశాడట. ఆ సినిమా పేరు ‘పెళ్లాం ఊరిళితే’. అల్లు అరవింద్ నిర్మాతగా, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రం 2003లో విడుదలై తెలుగు ప్రేక్షకులను ఫుల్లుగా ఆకట్టుకున్నది. ఇది తెలిసిన బన్నీ అభిమానులు ఆయనలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read More..

పిల్లలతో ఆడుకుంటున్న శ్రీలీల.. అవకాశాల్లేకేనా ! .. వీడియో వైరల్



Next Story

Most Viewed