గూస్ బంప్స్ తెప్పిస్తున్న Avatar: The Way of Water 'అవతార్ 2' న్యూ ప్రోమో

by Disha Web |
గూస్ బంప్స్ తెప్పిస్తున్న Avatar: The Way of Water  అవతార్ 2 న్యూ ప్రోమో
X

దిశ, సినిమా: ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ 'అవతార్'. 2009లో విడుదలై ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టింది. ప్రస్తుతం సినీ అభిమానులంతా 'అవతార్‌ 2' కోసం ఎదురుచూస్తుండగా.. ఈ సినిమా డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా 160కి పైగా భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇక అంతకంటే ముందు డిసెంబర్ 15న అర్ధరాత్రి 12 గంటలకు పలు చోట్ల కొన్ని షోస్ ప్రదర్శించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలవగా.. ఐమాక్స్‌ వంటి థియేటర్లలో 3D, 4DX 3D, 2D ఫార్మాట్‌లో సినిమాను వీక్షించవచ్చు. అయితే, ఈ విజువల్ వండర్‌ మూవీని పూర్తిగా ఆస్వాదించాలంటే మెరుగైన ఫార్మాట్‌లోనే చూడాలని చిత్ర యూనిట్ చెప్తోంది. ఇదిలా ఉంటే, రీసెంట్‌గా విడుదలైన రెండో ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్‌ తెచ్చుకోగా.. లేటెస్ట్ ప్రోమో కట్ అయితే మరింత క్రేజీగా మారింది. కంప్లీట్ యాక్షన్ అండ్ ఎమోషన్ సీన్స్‌తో నెక్స్ట్ లెవెల్‌లో ఉన్న ఈ ప్రోమో చూశాక ఆడియన్స్‌లో ఎగ్జైట్మెంట్ మరింత పెరిగిపోయింది.

Read More: 'బోత్ ఆర్ ఆర్గానిక్'.. యంగ్ హీరోలపై Kriti Sanon ఇంట్రెస్టింగ్ కామెంట్స్


Job Notifications Latest Current Affairs 2022


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed