అమ్మ పేరు చెప్పి ఆ హీరోను దారుణంగా మోసం చేసిన నెటిజన్..

by Mallepaka Hamsa |

టెక్నాలజీ వల్ల ఎంతోమంది కేటుగాళ్లు జనాలతో పాటు సినీ సెలబ్రిటీలను మోసం చేస్తున్నారు.

అమ్మ పేరు చెప్పి ఆ హీరోను దారుణంగా మోసం చేసిన నెటిజన్..
X

దిశ, సినిమా: టెక్నాలజీ వల్ల ఎంతోమంది కేటుగాళ్లు జనాలతో పాటు సినీ సెలబ్రిటీలను మోసం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏఐ ద్వారా ఫేక్ ఫొటోలను క్రియేట్ చేస్తూ.. డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇంకొందరు అయితే తమ కుటుంబంలోని వారికి ఆరోగ్యం బాలేదని.. హీరో, హీరోయిన్లను సాయం కోరుతూ.. డబ్బులు తీసుకుని జల్సాలు చేస్తున్నారు. తాజాగా, ఓ నెటిజన్ కోలీవుడ్ హీరోను దారుణంగా మోసం చేసిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అసలేం జరిగిందంటే..కోలీవుడ్ దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, హీరోగా మంచి సంపాదించుకున్న జీవీ ప్రకాష్ (GV Prakash)సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. సాయం కోరితే వెంటనే స్పందిస్తుంటారు. గతంలో ఎంతోమంది తనవంతు సాయం చేసిన ఆయన ఈ సారి దారుణంగా మోసమోయాడు. ఓ వ్యక్తి చెప్పిన అబద్ధాన్ని నమ్మి.. రూ. 20 వేలు పోగొట్టుకున్నారు. ట్విట్టర్‌లో ప్రసన్నసతీష్ అనే ఫ్రొఫైల్ పేరుతో ఉన్న ఓ గుర్తు తెలియని వ్యక్తి జీవీ ప్రకాష్‌ను నమ్మించి మోసం చేశాడు. తన తండ్రి బాధ్యత లేకుండా కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోవడంతో.. తన తల్లి కుటుంబాన్ని చూసుకుందని చెప్పాడు. అయితే ఆమె కూడా చనిపోవడంతో అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేవని చాలా బాధతో జీవీ ప్రకాష్‌కు మెసేజ్ చేశాడు.

దీంతో అతని బాధ చూసి కరిపోయిన జీవీ ప్రకాష్ వెంటనే అతనికి రూ.20 వేలు ఆన్‌లైన్ ద్వారా పంపించాడు. కానీ ఆ వ్యక్తి పంపిన ఫొటో చాలా ఏళ్ల క్రితంది అని కొంతమంది ఆయనకు చెప్పారు. ఒక ఫేక్ స్టోరీ చెప్పి మోసం చేశాడని జీవీ ప్రకాష్‌కు మెసేజ్‌లు పెట్టారు. దీంతో వెంటనే అతని నెంబర్‌కు ఫోన్ చేసినప్పటికీ కలవకపోవడంతో.. అతను మోసపోయానని తెలుసుకున్నాడు. ఇక ఈ విషయంపై నెటిజన్లు మండిపడుతున్నారు. డబ్బులు కోసం కకృతి పడిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే అడిగిన వెంటనే సాయం చేసిన జీవీ ప్రకాష్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆయనను జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇలా అన్యాయంగా డబ్బులు వృధా చేసుకోవద్దని చెబుతున్నారు.

Next Story