- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మ్యూజికల్ జర్నీ స్టార్ట్.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘మల్లికా గంధ’.. రొమాంటిక్ పోస్టర్ వైరల్
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda)రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’(telusu kada).

దిశ, సినిమా: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda)రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’(telusu kada). ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన(Neeraja Kona) దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మేకర్స్ ఫస్ట్ సింగిల్ - మల్లికా గంధను లాంచ్ చేయడం ద్వారా మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. మల్లికా గంధ లవ్ అండ్ మ్యూజికల్ మ్యాజిక్ తో మనసును తాకే అద్భుతమైన పాట. ట్యూన్, విజువల్స్ ప్రతీదీ ప్రేమ భావోద్వేగాలను బ్యూటీఫుల్ గా ప్రజెంట్ చేస్తోంది. థమన్ ఎస్ కంపోజిషన్ బ్రిలియంట్ గా ఉంది.
తంబురా, ఫ్లూట్ లాంటి ట్రెడిషనల్ వాయిద్యాలను మోడ్రన్ టచ్ లో వినిపించడం అదిరిపోయింది. సిద్ శ్రీరామ్ వాయిస్ మాటల్లో చెప్పలేనంత ఫీల్‌ను ఇస్తుంది. అతని వాయిస్ లోని ఇంటెన్సిటీ పాటకి ఓ ప్రత్యేక స్టైల్‌ను తీసుకొచ్చింది. సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా(Raashi Khanna) మధ్య ఉన్న కెమిస్ట్రీ, ఇద్దరి నేచురల్ బాడీ లాంగ్వేజ్ సాంగ్‌కు మరింత బ్యూటీని యాడ్ చేశాయి. రొమాంటిక్ సీన్స్, జోష్ నింపే డ్యాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టారు. కాగా, ఈ మూవీలో మరో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా.. వైవా హర్ష కీలక పాత్రలో కనిపించనున్నాడు. తెలుసు కదా సినిమా ఈ దీపావళి కానుకగా అక్టోబర్ 17న విడుదల కానుంది.
Mallika Gandha - Music Video | Telusu Kada | Siddu Jonnalagadda, Raashii Khanna,Thaman S, Sid Sriram






