- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మ్యూజికల్ జర్నీ స్టార్ట్.. ‘మారెమ్మ’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన మూవీ మేకర్స్
చిత్రబృందం ప్రమోషన్లలో భాగంగా మ్యూజికల్ జర్నీని ప్రారంభించింది. ఈ సినిమాలోని మొదటి పాట ‘బావ బావ’ను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ కుటుంబం నుంచి మరో వారసుడు టాలీవుడ్ వెండితెరకు పరిచయమవుతున్నారు. రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వైవిధ్యమైన కథాంశంతో సాగే ఈ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ‘మారెమ్మ’ మూవీకి మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి, బండారు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా సాగుతోంది. ఇటీవల విడుదలైన మాధవ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. మాస్ మహారాజా వారసుడిగా మాధవ్ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉన్నాడని ఆ పోస్టర్ చూస్తే అర్థమైంది. ఈ చిత్రం ద్వారా మాధవ్ ఒక పవర్‌ఫుల్ యాక్షన్ హీరోగా లాంచ్ కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా చిత్రబృందం ప్రమోషన్లలో భాగంగా మ్యూజికల్ జర్నీని ప్రారంభించింది. ఈ సినిమాలోని మొదటి పాట ‘బావ బావ’ను ఏప్రిల్ 13న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో హీరో మాధవ్, హీరోయిన్ దీపా బాలు పల్లెటూరి వాతావరణంలో ఎడ్ల బండిపై కూర్చుని ఒకరితో ఒకరు సరదాగా అల్లరి చేస్తున్నట్లు కనిపించారు. పల్లెటూరి ప్రేమికుల మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమను, అల్లరిని ఈ పోస్టర్‌లో చాలా అందంగా చూపించారు. ‘బావ బావ’ అనే పాట సరదాగా సాగే మెలోడీ అయి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ అప్‌డేట్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.






