- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మ్యూజికల్ జర్నీ స్టార్ట్.. ‘మా ఇంటి బంగారం’ నుంచి పార్టీ సాంగ్ రాబోతుందంటూ మేకర్స్ పోస్ట్
మ్యూజికల్ జర్నీని ప్రారంభించారు. ఈ సినిమాలోని మొదటి పాట ‘తస్సదియ్యా’ను ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలం విరామం తర్వాత మళ్లీ వెండితెరపై మెరిసేందుకు సిద్ధమయ్యారు. తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై సమంత నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’. సమంతకు ‘అలా మొదలైంది’, ‘ఓ బేబీ’ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకురాలు నందిని రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీనిని సామ్ భర్త రాజ్ నిడిమోరు నిర్మిస్తుండటం విశేషం. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రబృందం.. మ్యూజికల్ జర్నీని ప్రారంభించారు. ఈ సినిమాలోని మొదటి పాట ‘తస్సదియ్యా’ను ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఇది ఒక ఫ్యామిలీ పార్టీ సాంగ్ అని, అందరూ కలిసి డ్యాన్స్ చేసేలా ఈ పాట ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించి సమంత డ్యాన్స్ చేస్తున్న ఒక చిన్న వీడియో క్లిప్‌ను కూడా మేకర్స్ షేర్ చేశారు. ఇందులో సామ్ ఎంతో ఎనర్జిటిక్‌గా కనిపిస్తోంది. కాగా.. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ‘మా ఇంటి బంగారం’ అనే టైటిల్ వినడానికి చాలా సాఫ్ట్‌గా ఉన్నప్పటికీ, ఇందులో సమంత సరికొత్త లుక్‌లో కనిపిస్తోందని టాక్. సమంత సెకండ్ ఇన్నింగ్స్‌లో ఈ సినిమా ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఏప్రిల్ 14న రాబోయే ఈ పార్టీ సాంగ్‌తో సినిమా ప్రమోషన్స్ మరింత ఊపందుకోనున్నాయి.






