- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివాదంలో ‘విష్ణు విన్యాసం’ మూవీ.. అల్లు అర్జున్‌ను అవమానించారంటూ ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఫైర్
నటనపై మక్కువతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు శ్రీవిష్ణు(Sri Vishnu). తన సహజ నటనతో క్రమంగా హీరోగా స్థిరపడ్డాడు.

దిశ, సినిమా: నటనపై మక్కువతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు శ్రీవిష్ణు(Sri Vishnu). తన సహజ నటనతో క్రమంగా హీరోగా స్థిరపడ్డాడు. కంటెంట్‌కు ప్రాధాన్యత ఇస్తూ విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘విష్ణు విన్యాసం’(vishnu vinyasam). ఈ సినిమాతో యదునాథ్ మారుతీ రావు దర్శకుడిగా పరిచయం అవుతుండగా, శ్రీవిష్ణుకు జోడీగా నయన్ సారిక నటిస్తోంది. షూటింగ్ వేగంగా జరుగుతున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. అయితే ఇటీవల విడుదలైన ‘దేఖో విష్ణు విన్యాసం’ పాట అనుకోకుండా వివాదానికి దారి తీసింది. ఈ పాటలోని ఓ విజువల్ కారణంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను అవమానించారంటూ ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం..అల్లు అర్జున్ తన బ్రాండ్ గా AA పెట్టుకున్న విషయం తెలిసిందే. AA అల్లు అర్జున్(Allu Arjun) అండ్ అల్లు ఆర్మీ అనే మీనింగ్ వచ్చేలా ఆ బ్రాండ్ సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తన సినిమాల్లోనూ ఆ బ్యాండ్‌ను చూపిస్తుంటాడు. అలాంటిది అలాంటి బ్రాండ్‌ని విష్ణు అవమానించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ‘విష్ణు విన్యాసం’ సాంగ్‌లో శ్రీవిష్ణుAA బ్రాండ్ ను తలకిందులుగా చూపించాడు శ్రీవిష్ణు. AA ని తలకిందులుగా రాస్తే అది VV అవుతుంది. అంటే విష్ణు విన్యాసం అని. కానీ, అల్లు అర్జున్ ను అవమానించడానికే ఆలా చేశారని అల్లు అర్జున్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక కొందరు మాత్రం తన సినిమా పేరును రాసుకోవడంలో తప్పులేదని సమర్ధిస్తున్నారు.






