- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘బెన్ని’ మూవీ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన మూవీ టీమ్.. పవర్ ఫుల్ లుక్‌లో దర్శనమిచ్చిన టాలీవుడ్ హీరోయిన్
యంగ్ హీరోయిన్ నందిత శ్వేత(Nandita Shweta)కు పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు ‘నీకు నాకు డ్యాష్ డ్యాష్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ నందిత శ్వేత(Nandita Shweta)కు పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు ‘నీకు నాకు డ్యాష్ డ్యాష్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత కల్కి,ప్రేమకథా చిత్రం-2, శ్రీనివాస కళ్యాణం వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, మంగళవారం వంటి సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్న నందిత నటనకు బాగానే మార్కులు పడ్డాయి. ఒక్కసారిగా తెలుగులో అమ్మడు క్రేజ్ పెరిగిపోయింది. ఇక తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించిన నందిత గత ఏడాది ‘ఓ మంచి ఘేస్ట్’ మూవీతో ప్రేక్షకులను అలరించింది.
ఇదిలా ఉంటే.. తాజాగా, నందిత శ్వేత తన కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఈ అమ్మడు ‘బెన్ని’ (benny)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతేకాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు గ్లింప్స్‌ను కూడా షేర్ చేసింది. ఇక ఇందులో రక్తం మరకలతో, చెమటలతో కనిపించిన ఆమె హత్యలు చేసి చేతిలో పెద్ద కత్తి, గొడ్డలిని పట్టుకుని పవర్ ఫుల్ లుక్‌లో కనిపించింది. ఊరు చివరలో నిల్చొని ఉండగా.. ఆమెను చంపడానికి కొంతమంది పరుగెడుతూ వస్తున్నారు. ఊరంతా తగలబడుతుంటే పట్టించుకోకుండా కోపంగా ఆమె వైపుకు దూసుకువస్తున్నారు. ఇక ఇందులో నందిత టీచర్‌గా కనిపించనుంది. ప్రస్తుతం ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.
ఇక ఈ పోస్ట్‌కు నందిత ‘‘నేను బెన్ని మూవీతో తిరిగొచ్చేశాను.. కోపం, గౌరవం, యుద్ధం’’ అనే ఆసక్తికర క్యాప్షన్‌ను జత చేసింది. శ్రీలేష్ నాయర్(Srilesh Nair) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ కథగా రాబోతుంది. ఈ చిత్రాన్ని సండే సినిమాస్, రామేనహళ్లి జగన్నాథ ప్రజెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సచిన్ బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. అయితే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ‘బెన్ని’ సినిమాకు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్(Kiccha Sudeep) వాయిస్ ఓవర్ ఇచ్చారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది న్యూ ఇయర్ కానుకగా తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది.






