Keerthy Suresh: రిలీజ్‌కు సిద్ధమైన ‘రివాల్వర్ రీటా’ సినిమా.. ఆ హీరోతో పోటీ పడబోతున్న కీర్తి సురేష్

by Mallepaka Hamsa |

స్టార్ హీరోయిన్ కీర్తి (Keerthy Suresh)గత ఏడాది పెళ్లి చేసుకుని.. పర్సనల్ లైఫ్‌లో ఫుల్ బిజీ అయిపోయింది

Keerthy Suresh: రిలీజ్‌కు సిద్ధమైన  ‘రివాల్వర్ రీటా’ సినిమా.. ఆ హీరోతో పోటీ పడబోతున్న  కీర్తి సురేష్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ కీర్తి (Keerthy Suresh)గత ఏడాది పెళ్లి చేసుకుని.. పర్సనల్ లైఫ్‌లో ఫుల్ బిజీ అయిపోయింది. అలాగే వరుస చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ ఆమెకు ఒక్క హిట్ కూడా పడలేదు. గత కొద్ది కాలంగా కీర్తి విజయం కోసం ఎదురుచూస్తున్నారు.తెలుగు, హిందీ, తమిళ భాషల్లో చేసిన చిత్రాలతో పాటు ఓటీటీలో రిలీజ్ అయినవి కూడా పెద్ద బ్రేక్ ఇవ్వలేకపోయాయి. ఇక ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో కీర్తి పవర్ ఫుల్ స్టోరీతో.. లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతుంది. దర్శకుడు జేకే చంద్రు (JK Chandru)దర్శకత్వం వహించగా.. ఇందులో రాధిక శరత్ కుమార్, రెడీన్ కింగ్స్ లీ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఫ్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్‌ సుధన్ సుందరం, జగదీష్ పళనిస్వామి నిర్మిస్తున్నారు.

ఈ మూవీ ఆగస్టులో విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. తాజాగా, మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ‘రివాల్వర్ రీటా’ (Revolver Rita)వనంబర్ 28న గ్రాండ్‌గా థియేటర్స్‌లో తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతుందని తెలిపారు. అలాగే చుట్టూ ఉన్నవారంతా గన్స్‌ను కీర్తీకి గురి పెట్టి కోపంగా చూస్తుండగా.. ఆమె మాత్రం బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఎర్ర గులాబి పువ్వు పట్టుకుని నవ్వుతూ కనిపించి ఆసక్తిని పెంచింది. కాగా.. ఈ చిత్రం విడుదల రోజే రామ్ పోతినేని ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ రిలీజ్ కానుంది. దీనికి పోటీగా కీర్తి రాబోతుండటంతో ఇద్దరిలో గెలుపు ఎవరితో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

link

Next Story