- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
20 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ఓ భామ అయ్యో రామ’ మూవీ.. అధికారిక ప్రకటన విడుదల
టాలీవుడ్ హీరో సుహాస్(Suhas) ‘కలర్ ఫొటో’ సినిమాతో హీరోగా మారి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో సుహాస్(Suhas) ‘కలర్ ఫొటో’ సినిమాతో హీరోగా మారి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం విభిన్న కథలకు ఎంచుకుంటూ వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇటీవల సుహాస్ ‘ఓ భామ అయ్యో రామ’ (Oh Bhama Ayyo Rama)మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ ప్రేమకథ చిత్రానికి రామ్ గోదాల దర్శకత్వం వహించగా.. మాళవిక మనోజ్(Malavika Manoj) హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను వీ ఆర్ట్స్ బ్యానర్‌పై హరీష్ నల్లా నిర్మించారు. ఈ చిత్రంలో రవీందర్ విజయ్, బబ్లూ పృథ్వీ రాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, సాత్విక్ ఆనంద్, నయని పావని కీలక పాత్రలో కనిపించారు.
ఈ విభిన్నమైన రొమాంటిక్ లవ్ స్టోరీ జులై 11న థియేటర్స్‌లోకి వచ్చి ప్రేక్షకులను అలరించింది. కానీ బాక్సాఫీసు వద్ద హిట్ అందుకోలేకపోయింది. 20 రోజులకే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు రాబోతుంది. తాజాగా, ‘ఓ భామ అయ్యో రామ’ ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రముఖ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ చిత్రం హక్కులను ప్రముఖ సంస్థ ఈటీవీ విన్ సొంతం చేసుకోగా.. ఆగస్టు 1 నుంచి అందుబాటులోకి రాబోతున్నట్లు వెల్లడించారు. ‘‘ఆమె అతను కోల్పోయిన కలలను తిరిగి తెచ్చింది. అంతేకాకుండా లోతైన గాయాలు కూడా తీసుకువచ్చింది’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన సినీ ప్రియులు సంతోషపడుతున్నారు.






